Saturday, August 31, 2013

Nava manmathuda, Pelli Sandadi

Nava manmathuda
Singers: Chitra
Lyrics: Samaveda Shanmukha Sharma 
Music: M.M.Keeravani

నవమన్మథుడా అతిసుందరుడా నువ్వు చూసిన ఆ ఘనుడు
అక్కా ఎవరే అతగాడు ఇట్టే నీ మనసుని దోచాడు
శ్రీరాఘవుడా ప్రియ మాధవుడా నువ్వు వలచిన ఆ ప్రియుడు
చెల్లీ ఎవరే అతగాడు తుళ్ళే నీ వయసుకు జతగాడు

గోరు వెచ్చని ఊపిరే వేయి వేణువులూదగా తొలిముద్దు చిందించెనే
వీణ మీటిన తీరుగా ఒళ్ళు ఝల్లనే హాయిగా బిగి కౌగిలందించెనే
రతి రాగాలే శృతి చేశాడే జత తాళాలే జతులాడాడే
తనువంతా వింత సంగీతమేదో పలికే
అక్కా ఎవరే అతగాడు ఇట్టే నీ మనసుని దోచాడు

శ్రీరాఘవుడా ప్రియ మాధవుడా నువ్వు వలచిన ఆ ప్రియుడు
చెల్లీ ఎవరే అతగాడు తుళ్ళే నీ వయసుకు జతగాడు

వాడి చూపుల దాడితో వేడి ఆవిరి రేపెనే నిలువెల్లా తారాడెనే
చాటు మాటున చోటులో ఘాటు కోరికలూపెనే ఒడిచేరి తలవాల్చెనే
జడ లాగాడే కవ్వించాడే నడుమొంపుల్లో చిటికేశాడే
అధరాలతోనే శుభలేఖ రాసే మరుడే
చెల్లీ ఎవరే అతగాడు తుళ్ళే నీ వయసుకు జతగాడు

నవమన్మథుడా అతిసుందరుడా నువ్వు చూసిన ఆ ఘనుడు
అక్కా ఎవరే అతగాడు ఇట్టే నీ మనసుని దోచాడు
శ్రీరాఘవుడా ప్రియ మాధవుడా నువ్వు వలచిన ఆ ప్రియుడు
చెల్లీ ఎవరే అతగాడు తుళ్ళే నీ వయసుకు జతగాడు

navamanmathudaa Atisumdarudaa Nuvvu Cusina Aa Ganudu
akkaa Evare Atagaadu Itte Ni Manasuni Docaadu
shriraagavudaa Priya Maadhavudaa Nuvvu Valacina Aa Priyudu
celli Evare Atagaadu Tulle Ni Vayasuku Jatagaadu

goru Veccani Upire Veyi Venuvuludagaa Tolimuddu Cimdimcene
vina Mitina Tirugaa Ollu Jallane Haayigaa Bigi Kaugilamdimcene
rati Raagaale Shruti Ceshaade Jata Taalaale Jatulaadaade
tanuvamtaa Vimta Samgitamedo Palike
akkaa Evare Atagaadu Itte Ni Manasuni Docaadu

shriraagavudaa Priya Maadhavudaa Nuvvu Valacina Aa Priyudu
celli Evare Atagaadu Tulle Ni Vayasuku Jatagaadu

vaadi Cupula Daadito Vedi Aaviri Repene Niluvellaa Taaraadene
caatu Maatuna Cotulo Gaatu Korikalupene Odiceri Talavaalcene
jada Laagaade Kavvimcaade Nadumompullo Citikeshaade
adharaalatone Shubhaleka Raase Marude
celli Evare Atagaadu Tulle Ni Vayasuku Jatagaadu

navamanmathudaa Atisumdarudaa Nuvvu Cusina Aa Ganudu
akkaa Evare Atagaadu Itte Ni Manasuni Docaadu
shriraagavudaa Priya Maadhavudaa Nuvvu Valacina Aa Priyudu
celli Evare Atagaadu Tulle Ni Vayasuku Jatagaadu

No comments:

Post a Comment