Saturday, August 31, 2013

Shankaraa, Sankarabharanam

Shankaraa Nada Sareerapara
Singers:  SP. Balasubramaniam
Music: KV. Mahadevan 
Lyrics: Veturi

శంకరా నాద శరీరా పరా
వేద విహారా హరా జీవేశ్వరా... శంకరా...
 ప్రాణము నీవని గానమే నీదని ప్రాణమె గానమనీ
మౌనవిచక్షణ ధ్యాన విలక్షణ రాగమె యోగమని
నాదో పాసన చేసిన వాడను నీ వాడను నేనైతే
దిక్కరీంద్రజిత హిమగిరీంద్రసిత ఖందరా నీల కంధరా
క్షుద్రులెరుగని రుద్రవీణ నిర్ణిద్ర గానమిది
అవతరించరా విని తరించరా           ||శంకరా||
మెరిసే మెరుపులు మురిసే పెదవుల
చిరు చిరు నవ్వులు కాబోలు
ఉరిమే ఉరుములు సరి సరి నటనల
సిరి సిరి మువ్వలు కాబోలు
పరవశాన శిరసూగంగా ధరకు జారెనా శివగంగా
నా గానలహరి నువు మునుగంగా
ఆనంద వృష్టి నే తడవంగ            ||శంకరా||


 Shankara..naadashareera para
vedavihara haraa jeeveswara(2)

Praanamu neevani gaaname needani
praaname gaanamani
mouna vichakshana dhyaana vilakshana
ragame yogamani(pranamu)
naadopasana chesina vadanu
ne vadanu nenaite(2)
dhikkareemdrajita himagireendrasita
kandara neelakandharaa
kshudrulerugani rudraveena nirnidra
gaanamidi avadharincha raa
vini tarinchara(sankara)

Merise merupulu murise pedavula
chiru chiru navvulu kabolu
urime urumulu sari sari natanala
siri siri muvvalu kabolu(merise)
paravashana shirasuuganga
dharaku jarenaa shivaganga(2)
na gaana lahari nuvu munuganga
ananda vrushti ne tadavanga(shankara)

3 comments:

  1. Recent ga balu garu paduta teeyaga lo chebutunte vinnanu... 4th line Gaana Vilakshana kaadu.... Dhyaana vilakshana ani...

    Please check and correct if you agree.

    ReplyDelete