Tuesday, September 3, 2013

Na gontu shrutilona, Janaki Ramudu

Na gontu shrutilona
Music : K V Mahadevan
Singers : S.P. Balu, Chitra
Lyrics : Athreya


నా గొంతు శ్రుతిలోన నా గుండె లయలోన
ఆడవే పాడవే కోయిల
పాడుతూ పరవశించు జన్మ జన్మలా..(2)

ఒక మాట పది మాటలై అది పాట కావాలని
ఒక జన్మ పది జన్మలై అనుబంధమవ్వాలని
అన్నిటా ఒక మమతే పండాలని
అది దండలో దారమై ఉండాలని
కడలిలో అలలుగా కడ లేని కలలుగా
నిలిచిపోవాలని ...
అడవే పాడవే కోయిల
పాడుతూ పరవశించు జన్మ జన్మలా...

ప్రతి రోజు నువు సూర్యుడై నన్ను నిదుర లేపాలని
ప్రతి రేయి పసి పాపనై నీ ఒడిని చేరాలని
కోరికే ఒక జన్మ కావాలని
అది తీరకే మరు జన్మ రావాలని(2)
తలపులే రెక్కలుగా వెలుగులే దిక్కులుగా
ఎగిరి పోవాలని
ఆడవే పాడవే కోయిల
పాడుతూ పరవశించు జన్మ జన్మలా..


na gontu shrutilona na gunde layalona
adave padave koyila
padutu paravashinchu janma janmalaa..(2)

oka mata padi matalai adi pata kavalani
oka janma padi janmalai anubandhamavvalani
annitaa oka mamate pandaalani
adi dandalo daaramai undalani
kadalilo alaluga kada leni kalaluga
nilichipovalani...
adave padave koyila
padutu paravashinchu janma janmalaa...

prati roju nuvu suryudai nannu nidura lepalani
prati reyi pasi papanai ne odini cheralani
korike oka janma kavalani
adi teerake maru janma ravalani(2)
talapule rekkaluga velugule dikkuluga
egiri povalani
adave padave koyila
padutu paravashinchu janma janmalaa..

No comments:

Post a Comment