Monday, September 2, 2013

Neevu leka veena, Dr. Chakravarthi

Neevu leka veena
Artist(s): Susheela 
Lyricist: Arudra, Atreya, Dasarathi, Kosaraju 
Music: Saluri Rajeswara Rao


నీవు లేక వీణ పలుకలేనన్నది
నీవు రాక రాధ నిలువలేనన్నది(2)

జాజి పూలు నీకై రోజు రోజు పూచే
చూచి చూచి పాపం సొమ్మసిల్లిపోయే
చందమామ నీకై తొంగి తొంగి చూచి
సరసను లేవని అలుకలుబోయే...

కలలనైన నిన్ను కనుల చూతమన్న
నిదుర రాని నాకు కలలు కూడా రావే
కదలలేని కాలం విరహ గీతి రేపి(2)
పరువము వృధగా బరువుగ సాగే...

తలుపులన్ని నీకై తెరచి ఉంచినాను
తలపులెన్నో మదిలో దాచి వేసినాను
తాపమింక నేను ఓపలేను స్వామీ(2)
తరుణిని కరుణను ఏలగ రావా....

neevu leka veena palukalenannadi
neevu raka radha niluvalenannadi(2)

jaaji pulu neekai roju roju puche
chuchi chuchi papam sommasillipoye
chandamaama neekai tongi tongi chuchi
sarasanu levani alukaluboye...

kalalanaina ninnu kanula chutamanna
nidura raani naku kalalu kuda raave
kadalaleni kaalam viraha geeti repi(2)
paruvamu vrudhagaa baruvuga saage...

talupulanni neekai terachi unchinaanu
talapulenno madilo daachi vesinaanu
taapaminka nenu opalenu swamee(2)
tarunini karunanu yelaga raavaa....

No comments:

Post a Comment